బంపర్ ఆఫర్.. కారు కొంటున్నారా.. రూ.50వేల బెన్ఫిట్స్ మీకోసమే..

by Anukaran |
బంపర్ ఆఫర్.. కారు కొంటున్నారా.. రూ.50వేల బెన్ఫిట్స్ మీకోసమే..
X

దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా కారణంగా గత ఏడాదిన్నర నుంచి కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. కరోనా విజృంభణ సమయంలో ప్రజా రవాణా నిలిచిపోయింది. ఈ క్రమంలో సొంతగా ఫోర్ వీల్లర్ ఉంటే ప్రయాణ సమయంలో కరోనా ముప్పు నుంచి కొంత ఉపశమనం కలుగుతుందని భావించి సామార్థ్యాన్ని బట్టి సెకండ్ హ్యాండ్, ఫస్ట్ హ్యాండ్లలో వాహనాలు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో సెకండ్ హ్యాండ్ కార్లకు భారీగా డిమాండ్ పెరిగింది. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి.

అయితే, ఇయర్ ఎండ్ సేల్స్ కింద కార్ల కంపెనీలు భారీగా ఆఫర్లు ఇవ్వడం వల్ల సేల్స్ పెరుగనున్నాయి. ఈ క్రమంలో హ్యుందయ్ భారీ డిస్కౌంట్స్ బెన్ఫిట్స్‌తో ముందుకు వచ్చింది. ఎంపిక చేసిన కార్లపై ఏకంగా రూ.50వేల వరకు డిస్కౌంట్ బెన్ఫిట్స్ ఇవ్వనుంది. ఈ సందర్భంగా హ్యుందయ్ కంపెనీకి చెందిన Hyundai Aura, Grand i10 Nios, Hyundai Santro మోడల్స్‌ కొనుగోళ్లపై ఈ ఆఫర్స్ వర్తించనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed