రూ. 2 కోట్లు ఎత్తుకెళ్లిన వాచ్‌మెన్‌ అరెస్ట్

by Anukaran |
రూ. 2 కోట్లు ఎత్తుకెళ్లిన వాచ్‌మెన్‌ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ సైనిక్ పురి చోరీ కేసులో పురోగతి లభించింది. చెన్నైలో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాచ్ మెన్ తోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు 8 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.

కాగా, ఇటీవలే తన ఇంట్లో సుమారు రూ. 2 కోట్ల వరకు వాచ్ మెన్ చోరీ చేశాడని రియల్టర్ నర్సింహారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగారు. అప్పటి నుంచి గాలిస్తున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని పట్టుకోగలిగారు.

Advertisement

Next Story