సైబర్ క్రిమినల్స్‌తో భయం వద్దు.. యాక్షన్ ప్లాన్ రెడీ..!

by Anukaran |
సైబర్ క్రిమినల్స్‌తో భయం వద్దు.. యాక్షన్ ప్లాన్ రెడీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో సోషల్‌ అకౌంట్‌లతో జాగ్రత్త వహించకపోతే సైబర్ నేరగాళ్లు నట్టేట ముంచేస్తున్నారు. ఇప్పటికే ఫేస్ బుక్‌ అకౌంట్లను హ్యాక్ చేస్తోన్న క్రిమినల్స్.. డబ్బులు కావాలంటూ మేసేజ్‌లు పంపుతూ మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. వాట్సాప్‌, టెలిగ్రామ్‌ అకౌంట్‌లో కూడా ఫేక్ లింక్‌లను క్రియేట్ చేసి ఆయా గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. వీటిని గుడ్డిగా నమ్మి క్లిక్ చేసిన బాధితుల పర్సనల్, బ్యాంక్ అకౌంట్ వివరాలను సేకరించి దోపిడీ చేస్తున్నారు.

అందుబాటులోకి హెల్ప్‌లైన్ నెంబర్..

ఈ నేపథ్యంలోనే సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు హెల్ప్‌లైన్ నెంబర్‌ను తీసుకొచ్చారు. సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా 155260 హెల్ప్‌లైన్‌ సేవలు ప్రవేశపెట్టారు. ప్రతిఒక్కరు ఈ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు.

ముఖ్యంగా ఈ హెల్ప్‌లైన్ ద్వారా.. బాధితుడు పోగొట్టుకున్న డబ్బు ఏ వ్యాలెట్‌కు బదిలీ అయిందో తెలుసుకోవచ్చు. అలాగే, సదరు బ్యాంకు లేదా వ్యాలెట్‌ నిర్వాహకులకు సమాచారం అందించడం, ఇదే సమయంలో సైబర్‌ నేరగాళ్లు డబ్బులను విత్‌ డ్రా చేసుకోకుండా యాక్షన్ తీసుకుంటారు సైబర్ క్రైమ్ పోలీసులు.

Advertisement

Next Story