- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ బంద్ కి అసదుద్దీన్ ఓవైసీ మద్దతు
దిశ, వెబ్ డెస్క్: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీలో చేపట్టిన బంద్ కి ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంఘీభావం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కార్మికులు చేపడుతున్న బంద్‌కు ఆయన మద్దతు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలను తాము ఖండిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం కర్నూలు జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆదోని వెళ్తున్న ఆయన కోడుమూరు పట్టణంలో బంద్ పాటిస్తున్న కార్మికులకు మద్దతు పలికారు.
ఈ సందర్భంగా కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, దాన్ని ప్రైవేటీకరణ పేరుతో బయటి వ్యక్తులకు కట్టబెట్టే నిర్ణయాన్ని కేంద్రం విరమించుకోవాలని హెచ్చరించారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించనున్నట్లు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఇకపోతే ఆదోని మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తరపున పలువురు అభ్యర్ధులు బరిలో నిలిచారు. వారికి మద్దతుగా ప్రచారం చేసేందుకు అసదుద్దీన్ ఆదోనికి వెళ్లారు. ఎంఐఎం పార్టీ దేశవ్యాప్తంగా పోటీ చేస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే.