- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నేను ఎన్ఆర్ఐని.. మీరు బాగా నచ్చారు.. పెళ్లి చేసుకుంటా’
దిశ, వెబ్‌డెస్క్ : ‘నేను ఎన్ఆర్ఐని. లండన్‌లో ఉంటున్న. బీఎండబ్ల్యూ షో రూంలో పని చేస్తున్న. నెలకు లక్షల్లో వేతనం వస్తుంది. మీరు నాకు బాగా నచ్చారు. మీ అందానికి ముగ్ధుడునయ్యా. త్వరలో ఇండియాకు వస్తా. నిన్ను పెళ్లి చేసుకుంటా’.. అంటూ ఓ సైబర్ నేరగాడు హైదరాబాద్‌కు చెందిన డ్యాన్సర్‌కు మస్కా కొట్టాడు. ఆమెను ప్రేమిస్తున్నానని నమ్మించి లక్షల్లో దండుకున్నాడు.
బంజారహిల్స్‌కు చెందిన మహిళా డ్యాన్సర్ వరుడి కోసం షాదీ.కామ్‌లో తన ప్రొఫైల్‌ను అప్ లోడ్ చేసింది. ఆ ప్రొఫైల్‌ను చూసిన ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి, తన గురించి పరిచయం చేసుకున్నాడు. తను లండన్‌లో బీఎండబ్ల్యూ షో రూంలో సూపర్ వైజర్‌గా పని చేస్తున్నానని చెప్పాడు. ఇద్దరి అభిప్రాయాలను పంచుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. అతడి మాటలు నమ్మిన ఆమె.. అతడితో పెళ్లికి ఒప్పుకుంది. త్వరలోనే భారత్‌కు వచ్చి వివాహం చేసుకుంటాని నమ్మపలికాడు. ఇలా ఆమెకు రోజు ఫోన్ చేస్తూ మాట్లాడాడు.
ఈ క్రమంలో ఓ రోజు ఆమెకు ఫోన్ చేసి మన ప్రేమకు గుర్తుగా నీకు గోల్డ్, వజ్రాలు, ల్యాబ్ టాప్‌ను గిఫ్ట్ గా పంపిస్తున్నానని చెప్పాడు. వాటికి సంబంధించిన ఫొటోలను సైతం ఆమెకు షేర్ చేశాడు. రెండు రోజుల తర్వాత ఢిల్లీ ఎయిర్ ఫోర్ట్ నుంచి మాట్లాడుతున్నామని ఆమెకు ఓ ఫోన్ వచ్చింది. నీ పేరు మీద లండన్ నుంచి గిఫ్ట్‌లు వచ్చాయని, వాటిని తీసుకోవాలంటే ప్రాసెసింగ్ ఫీజు కట్టాలని పేర్కొన్నారు. అలా దశల వారీగా ఆమె నుంచి రూ.11.75 వేలను వాళ్ల అకౌంట్లలోకి ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. అయినా ఇంకా డబ్బులు పంపాలని కోరడంతో డ్యాన్సర్‌కు అనుమానం వచ్చింది. వెంటనే ఆమె హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫోన్ నంబర్లు, అకౌంట్ నంబర్లను పరిశీలించిన పోలీసులు సైబర్ క్రైం జరిగినట్లు గుర్తించారు.