- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చైల్డ్ పోర్నోగ్రఫీపై హైదరాబాదీల కన్ను.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన 16 మంది
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మృగాళ్ల అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. కామంతో కళ్ళుమూసుకుపోయి చిన్నాపెద్దా, వావి వరుస అనే విచక్షణ మరిచి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇక ఈ అఘాయిత్యాలకు ఎక్కువ బలవుతున్నది చిన్నారులే అవ్వడం బాధాకరమైన విషయం. దీనికి కారణం పోర్న్ అనేది అందరికి తెలిసిన వాస్తవమే. ప్రస్తుతం దేశంలో చైల్డ్ పోర్నోగ్రఫీ ఎక్కువైపోతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ఉండడంతో ఎక్కువమంది పోర్న్ చూడడానికి అలవాటు పడుతున్నారు. తాజా అధ్యయనం ప్రకారం ఇటీవల కాలంలో ఎక్కువమంది చైల్డ్ పోర్నోగ్రఫీకి బానిసలై చిన్నారులను చిదిమేస్తున్నారు. తాజాగా చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తున్న 16 మందిపై హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు కేసులు నమోదు చేశారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఆదేశాల మేరకు పోర్నోగ్రఫీ చూసేవారి ఐపీ అడ్రెస్ లను సేకరించి క్రైమ్ బ్రాంచ్ కి పంపించడం జరిగింది. ఇందులో ఎక్కువగా చైల్డ్ పోర్న్ చూస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.దీంతో చైల్డ్ పోర్నోగ్రఫీపై కఠినంగా వ్యవహరిస్తున్న కేంద్రం దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో చైల్డ్ పోర్న్ చూస్తున్న 16మంది ఐపీ అడ్రెస్ లను కనిపెట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు.