- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అసెంబ్లీ ముందు పోలీస్ కమిషనర్.. రోడ్ల మీదకు వస్తే కఠిన చర్యలు..!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ నివారణ, ప్రజల్లో అవగాహన కోసం హైదరాబాద్ సిటీ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. అసెంబ్లీ ముందు సిటీ కమిషనర్ అంజనీ కుమార్ ఆధ్వర్యంలో.. కరోనా వైరస్ ఆకారపు హెల్మెట్లు, సేఫ్‌గార్డులు, లాఠీలకు కరోనా బొమ్మలను అమర్చి ప్రత్యేకంగా అవగాహన కల్పించారు పోలీసులు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రేపటి నుంచి లాక్‌డౌన్ రిలాక్సేషన్ సమయంలో ప్రభుత్వం చేసిన మార్పులకు మద్ధతు ఇవ్వాలని కోరారు. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి ఉదయం 6 వరకు కఠిన లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని హెచ్చరించారు. అనవసరంగా రోడ్ల మీదకు వస్తే కేసులు తప్పవని.. ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించాలన్నారు. ఇప్పటివరకు కమిషనరేట్ పరిధిలో 6 వేల వాహనాలను సీజ్ చేశామని చెప్పారు. ఫ్రంట్ లైన్ వారియర్లుగా ఉన్న పోలీసుల్లో ఇప్పటికే రెండు వేల మంది సిబ్బందికి కరోనా వైరస్ సోకగా.. వారిలో 17 మంది మరణించారని అంజనీ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
Hyderabad City Police organized a special program to create awareness on Coronavirus while wearing coronavirus Helmets, Safeguards, Gadha in front of the Assembly. https://t.co/JMTXvFy9c0 pic.twitter.com/4R6lRIEroO
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) June 9, 2021