హైదరాబాద్ బిర్యానీకి అరుదైన గౌరవం

by Shamantha N |
Hyderabad Biryani
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరానికి గుర్తింపు తెచ్చి పెట్టిన బిర్యానీకి ఈసారి కూడా ఢిల్లీ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. కేంద్ర గిరిజన సంక్షేమ శాఖకు చెందిన ట్రైఫెడ్ (గిరిజన సమాఖ్య) ఆధ్వర్యంలో రాజధాని నగరంలో ‘ఢిల్లీ హాట్’లో ఈ నెల 1వ తేదీ నుంచి జరుగుతున్న ‘ఆది మహోత్సవ్’ ముగింపు సందర్భంగా సోమవారం నిర్వాహకులు ఈ ప్రకటన చేశారు. గతేడాది పక్షం రోజుల పాటు జరిగిన ఆది మహోత్సవ్‌లో తొలి అవార్డు లభించినట్లుగానే ఈసారి కూడా మళ్లీ మనకే వచ్చింది. గిరిజన హస్తకళలు, సంప్రదాయాలు, వేషభాషలు, కట్టూ-బొట్టు తదితరాలను ప్రతిబింబించేలా అనేక రాష్ట్రాలు స్టాళ్ళను ఏర్పాటు చేశాయి. వాటికి తోడుగా హైదరాబాద్ నగరం తరఫున బిర్యానీ స్టాల్ కూడా ఏర్పాటైంది. ప్రత్యేక కేటగిరీలో హైదరాబాద్ బిర్యానీకి ఈసారి తొలి అవార్డు లభించింది. ఈ నెల 1వ తేదీన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా జరిగిన ప్రారంభోత్సవంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా, సహాయ మంత్రి రేణుకాసింగ్ తదితరులంతా పాల్గొన్నారు. పుడ్ ఫెస్టివల్‌కు మొత్తం ఇరవై రాష్ట్రాలు స్టాళ్ళను ఏర్పాటు చేసినా అందులో హైదరాబాద్ ‘థమ్ బిర్యానీ’కే తొలి ప్రైజ్ దక్కింది.

Advertisement

Next Story

Most Viewed