HYDయువతికి ‘మిసెస్‌ గ్లోబల్‌ షో’ కిరీటం

by Shyam |
HYDయువతికి ‘మిసెస్‌ గ్లోబల్‌ షో’ కిరీటం
X

దిశ, వెబ్‌డెస్క్: ‘మిసెస్‌ గ్లోబల్‌ షో’ పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన యువతి అగ్రస్థానంలో నిలిచి కిరీటాన్ని దక్కించుకుంది. ఈ కార్యక్రమం అమెరికాలో వర్చువల్‌గా నిర్వహించారు. అందులో హైదరాబాద్ నగరానికి చెందిన NRI యువతి ‘చైతన్య’ ప్రతిష్ఠాత్మకమైన ‘మిసెస్‌ గ్లోబల్‌ షో టాపర్‌-2020’గా నిలిచారు.

2019లో జరిగిన మిసెస్‌ భారత్‌ న్యూయార్క్‌ పోటీల్లోనూ ఆమె కిరీటాన్ని దక్కించుకోవడం విశేషం. అంతేకాకుండా ఆమె అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె ప్రపంచ తెలుగు కల్చరల్‌ ఫెస్టివల్‌కు అందాల సుందరి కో-ఆర్డినేటర్‌‌గా వ్యవహరిస్తున్నారు. టాటా వారి “తారల ఇంట్లో సందడి’ షోలో స్పెషల్‌ గెస్ట్‌గా వ్యవహరించారు. మై డ్రీం గ్లోబల్‌ ఫౌండేషన్‌ వర్జీనియా చాప్టర్‌ కో-ఆర్డినేటర్‌‌గా కూడా ప్రస్తుతం ఆమె సేవలందిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Advertisement

Next Story

Most Viewed