అనతి కాలంలోనే ‘దిశ’ పాఠకుల అభిమానాన్ని చూరగొంది

by Shyam |
అనతి కాలంలోనే ‘దిశ’ పాఠకుల అభిమానాన్ని చూరగొంది
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: ప్రారంభించిన అనతి కాలంలోనే దిశ దినపత్రిక పాఠకుల అభిమానాన్ని చూరగొన్నదని హైదరాబాద్ జిల్లా డీఈఓ రోహిణి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె తన కార్యాలయంలో ఉద్యోగులు , సిబ్బంది తో కలిసి దిశ పత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. పత్రిక మొదలైన స్వల్ప వ్యవధిలోనే ఎన్నో సంచలన కథనాలను ప్రచురించి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. అసిస్టెంట్ కమిషనర్ జూపల్లి నర్సింగరావు మాట్లాడుతూ… పత్రికా రంగంలో దిశ దినపత్రిక నూతన ఒరవడిని సృష్టిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీ శ్రీనివాస్ రెడ్డి, టీఎన్జీవో పాఠశాల విద్యాశాఖ యూనిట్ అధ్యక్షుడు కేఆర్ రాజ్ కుమార్ , కార్యదర్శి భాస్కర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story