దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపేసిన భర్త

by Sumithra |
దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపేసిన భర్త
X

దిశ, భువనగిరి: యాదాద్రి-భువనగిరిజిల్లా భువనగిరి మండలం పచ్చర్ల బోడు తండాలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన భర్త తరచూ అనుమానిస్తూ చివరికి వెంటబడి గొడ్డలితో నరికి చంపాడు. పచ్చర్ల బోడు తండాకు చెందిన పానుగోతు లచ్చు 14 ఏండ్ల క్రితం సునీతా (35)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమారులున్నారు. వీరి సంసార జీవితం కొన్నేళ్లు సజాజావుగా సాగుతుండగా.. సంసారంలో అనుమానం అనే బీజం మొలకెత్తి తరచూ గొడవలు పడుతున్నారు.

లారీ డ్రైవర్ గా పని చేస్తూ లచ్చు భార్య సునీతను నిత్యం వేధిస్తూ హించిస్తున్నాడు. మంగళవారం అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన లచ్చు గొడ్డలితో వెంటబడి నది బజారులో విచక్షణారహితంగా దాడి చేశాడు. సునీతాఅక్కడికక్కడే మృతి చెందగా.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story