- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రేమించి పెళ్లి.. కట్నం కోసం కడతేర్చి
దిశ, నిజామాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కట్నంపై ఆశ పుట్టింది. లాక్‌డౌన్ అవకాశం కల్పించింది. పథకం ప్రకారం స్వగ్రామానికి భార్యను తీసుకెళ్లి తల్లీతో కలిసి కడతేర్చాడు ఓ భర్త. ఆనవాళ్లు లేకుండా ఉండటం కోసం మృతదేహం దహనం చేశారు. కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు తల్లీకొడుకులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ కేసు వివరాలను మంగళవారం నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌కుమార్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఓ షాపింగ్‌మాల్‌లో ప్రకాశం జిల్లా అర్ధవీడుకు చెందిన యెండల రాధ సేల్స్‌గర్ల్‌గా పనిచేసేది. అక్కడే బానోత్ రవీందర్ కూడా పనిచేసేవాడు. అతని స్వగ్రామం నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం పొతంగల్ గ్రామం శివతండా. రాధ, రవీందర్‌ల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గత ఏడాది డిసెంబర్‌లో నవీపేటలోని ఓ ఆలయంలో పెండ్లి చేసుకున్నారు. కానీ, వీరి వివాహాన్ని రవీందర్ తల్లి పద్మ అంగీకరించలేదు. ఈ విషయమై గొడవలు జరగడంతో పోలీసులకు రాధ ఫిర్యాదు చేసింది. కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సెలింగ్ చేసి ఇంటికి పంపించారు. కానీ, కొంతకాలం తర్వాత రాధను పద్మ వేధించడం మొదలు పెట్టింది. దీంతో రెండు నెలల క్రితం సనత్‌నగర్‌లో వేరు కాపురం పెట్టారు. గత నెల 24 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో షాపింగ్‌మాల్స్ మూతపడ్డాయి. భార్యను తీసుకుని రవీందర్ స్వగ్రామం శివతండాకు వచ్చేశాడు. ఇక అప్పటి నుంచి కట్నం కోసం తల్లీకొడుకులు రాధను వేధించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయానికి వచ్చారు. ఈ నెల 24న బంధువుల దగ్గరకు వెళ్లి వద్దామని మభ్యపెట్టి రాధను తల్లీకొడుకులు కలిసి ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చారు. మాక్లూర్ మండలం రాంచంద్రంపల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి హత్య చేశారు. ఆధారాలు లభించకుండా ఉండటం కోసం మృతదేహాన్ని దహనం చేశారు. కానీ, శవం పూర్తిగా దహనం కాలేదు. ఉపాధి పనుల కోసం అటవీ ప్రాంతం వైపు వచ్చిన కూలీలు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టగా రాధను భర్త రవీందర్, అతని తల్లి పద్మలు హత్య చేసినట్టు వెల్లడైంది. నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు.
Tags: Nizamabad,Women murder,Acp srinivas