భార్యను టార్గెట్ చేసిన భర్త.. రోడ్డుపై వెళ్తుండగా..!

by srinivas |   ( Updated:2021-08-06 00:00:19.0  )
road accident
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం పెద్దబమ్మిడిలో దారుణం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తోన్న భార్యను మరో వాహనంతో వచ్చిన భర్త ఢీకొట్టి చంపాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలిచారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story