సినీ ఫక్కీలో భార్య మర్డర్‌కు స్కెచ్.. భర్తకు షాకిచ్చిన లోకల్స్!

by Sumithra |
సినీ ఫక్కీలో భార్య మర్డర్‌కు స్కెచ్.. భర్తకు షాకిచ్చిన లోకల్స్!
X

దిశ, వెబ్‌డెస్క్ : కట్టుకున్న భార్యను కడతేర్చేందుకు భర్త స్కెచ్ వేశాడు. అనుకున్నదే తడవుగా సినీ ఫక్కీ నిర్వహించాడు. తన ద్విచక్ర వాహనంపై టీఎన్జీవో కాలనీలోని ముళ్లపొదల్లోకి భార్యను తీసుకెళ్లి గొంతు నులిమేందుకు ప్రయత్నించాడు. తనను రక్షించాలని భార్య అరుపులు విని స్థానికులు ఒక్కసారిగా అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఊపిరాడక కొట్టుకుంటున్న వివాహితను రక్షించి భర్తకు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో బుధవారం వెలుగుచూసింది.

స్థానికుల ఫిర్యాదు మేరకు భర్త నాగేశ్వర్ రావును పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. అయితే, తీవ్రంగా గాయపడిన బాధితురాలని చుట్టుపక్కల వారి సాయంతో ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా, ఈ హత్యాయత్నానికి గల పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Advertisement

Next Story