భార్య సీటులో భర్త.. కేటీఆర్ స్పందించేనా?

by Shyam |   ( Updated:2021-06-29 00:41:52.0  )
భార్య సీటులో భర్త.. కేటీఆర్ స్పందించేనా?
X

దిశ సిద్దిపేట: నూతన మున్సిపల్ చట్టం ఏర్పడ్డాక జరిగిన సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ హవా కొనసాగింది. 43 స్థానాలకు బీజేపీ, ఎంఐఎం ఒక్కొక్కటి, స్వతంత్రులు ఐదుగురు, 36 సీట్లు టీఆర్‌ఎస్ గెలుచుకుంది. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కడవేరుగు మంజుల అధ్వర్యంలో మొట్టమొదటి కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 11వ వార్డ్ నుండి గెలుపొందిన దాసరి భాగ్యలక్ష్మి శ్రీనివాస్ లు హాజరు కావాల్సి ఉండగా.. భాగ్యలక్ష్మికి బదులుగా ఆమె భర్త శ్రీనివాస్ హాజరయ్యారు.

మొట్టమొదటి సమావేశంలోనే ఇలా జరగడంతో స్థానికులు, ప్రతిపక్ష నాయకుల నుండి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కౌన్సిల్ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్స్ ఎక్కువగా ఉండటంతో.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అలాంటప్పుడు రిజర్వేషన్ లు ఎందుకని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తూ ఇమామ్ విమర్శించారు. భార్యల స్థానాలను భర్తలు అక్రమించడాన్ని స్థానిక మంత్రి హరీష్ రావు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

హుజురాబాద్‌లో సీక్రెట్ సర్వే… ఈటల ప్రభావం తగ్గిందా? పెరిగిందా?

Advertisement

Next Story

Most Viewed