అనుమానంతో భార్య, కూతుర్ని గొడ్డలితో నరికిన భర్త

by Sumithra |
Murder
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యతో పాటు కన్న కూతురిని ఓ కిరాతకుడు గొడ్డలితో నరికి చంపాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బోధన్ మండలం పెద్ద మావందికి చెందిన మల్లీశ్వరితో రుద్రూర్‌కు చెందిన గంగాధర్‌తో వివాహం జరిగింది. వీరికి రుత్విక అనే(13)ఏళ్ల కూతురు ఉంది. గంగాధర్ గత కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నదని భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఇటీవల పెద్దల సమక్షంలో పంచాయతీ సైతం జరిగింది. అయినా గంగాధర్ అనుమానంతో గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భార్య మల్లీశ్వరి(30), కూతురు రుత్విక (13)ని దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం రుద్రూర్ పోలీస్ స్టేషన్‌కి వచ్చి లొంగిపోయాడు. ఘటనా స్థలాన్ని రుద్రూర్ సీఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ రవీందర్‌లు పరిశీలించి కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story