ఆడపిల్లలు పుట్టారని భార్య గొంతు కోశాడు..

by Anukaran |   ( Updated:2020-08-12 23:37:11.0  )
ఆడపిల్లలు పుట్టారని భార్య గొంతు కోశాడు..
X

దిశ, వెబ్‌డెస్క్ :

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఆడపిల్లలను కన్నదనే కోపంతో ఓ భర్త కత్తితో భార్య గొంతుకోశాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన జిల్లాలోని నంద్యాల తెలుగుపేటలో గురువారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. తెలుగుపేటకు చెందిన లలిత, బాలరాజు దంపతులకు నలుగురు ఆడపిల్లలు.

కొడుకు కోసం ప్రయత్నించిన ప్రతిసారీ ఆడపిల్లే పుట్టింది. దీంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే నిన్న కూడా ఇద్దరి మధ్య వివాదం తలెత్తడంతో ఆగ్రహించిన భర్త కత్తితో భార్య గొంతు కోసి, ఆపై బండరాయితో తలపై మోదాడు. అనంతరం తాను కూడా గొంతు కోసుకున్నాడు.

రక్తపు మడుగులో ఉన్నదంపతులను స్థానికులు గుర్తించి వెంటనే నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా, భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story