భార్యతో గొడవ పడి చెట్టుకు ఉరేసుకున్నాడు..!

by Aamani |
couple suicide
X

దిశ, బోధన్: భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రెంజల్ మండలం దూపల్లిలో వెలుగుచూసింది. ఇదే గ్రామానికి చెందిన శంకర్(28).. లలిత అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరూ ఆడపిల్లలే. తరచూ భార్యభర్తలిద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి ఈ నేపథ్యంలోనే బుధవారం భార్యతో గొడవపడిన శంకర్ ఇంటి నుంచి బయటకు వెళ్లి ఎంతకీ తిరిగిరాలేదు. అనుమానంతో కుటుంబ సభ్యులు గ్రామ శివారులో గాలింపు చేపట్టగా ఓ చెట్టుకు ఉరివేసుకొని విగతాజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు శవ పంచనామా నిర్వహించి పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story