ఓ వైపు కాలుతున్న భార్య చితి.. భర్త చేసిన పనికి అందరూ షాక్..

by Sumithra |   ( Updated:2021-08-25 23:02:13.0  )
ఓ వైపు కాలుతున్న భార్య చితి.. భర్త చేసిన పనికి అందరూ షాక్..
X

దిశ, వెబ్‌డెస్క్ : భార్య చనిపోయిందన్న నిజాన్ని ఆ భర్త తట్టుకోలేకపోయాడు. భార్య ఇక తనతో ఉండదనే బాధ దిగమింగుకోలేకపోయాడు. భార్య లేకుండా తాను ఎందుకు బతకాలి అన్న జ్ఞాపకాలే అతని ముందు మెదలుతున్నాయి. ఈ క్రమంలో భార్య మరణాన్ని తట్టుకోలేక, ఆమె చితిలోకి దూకి భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ విషాద ఘటన ఒడిశాలోని కలహండి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని సియాల్జోడి గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల ప్రకారం.. నీలమణి సబర్‌(65) అనే వ్యక్తి.. భార్య రైబారి(60) అంత్యక్రియలను తన నలుగురు కుమారులతో పాటు నిర్వహించారు.

చితికి నిప్పంటించాక సంప్రదాయం ప్రకారం పక్కనే ఉన్న చెరువు వద్దకు నలుగురు కుమారులు, బంధువులు స్నానానికి వెళ్లిన తర్వాత.. కాలుతున్న తన్న భార్య చితిలో నీలమణి దూకారు బలవన్మరణం చేసుకున్నాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. భార్య మృతి తట్టుకోలేక భర్త అలా చేయడంతో అక్కడున్న వారంతా ఒక్క సారిగా షాక్ అయ్యారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది.

Advertisement

Next Story

Most Viewed