డబ్బు కోసం కక్కుర్తి.. భార్యకు న్యూడ్ ఫోటోలు పంపి…

by Sridhar Babu |   ( Updated:2020-06-20 07:58:43.0  )
డబ్బు కోసం కక్కుర్తి.. భార్యకు న్యూడ్ ఫోటోలు పంపి…
X

దిశ, క్రైమ్‌బ్యూరో: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. డబ్బు కోసం కక్కుర్తి పడ్డాడు. ఈజీగా మనీకి ప్లాన్ చేసి భార్యనే బ్లాక్ మెయిల్ చేశాడు. లక్షల్లో డబ్బు నొక్కుతూ చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలైయ్యాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్‌‌ జిల్లాకు గుగులోత్‌ సంతోష్‌కుమార్‌కు హైదరాబాద్‌కు చెందిన ఓ యువతికి మ్యాట్రీమోని ద్వారా పరిచయం ఏర్పడి, చివరికి ప్రేమికులయ్యారు. తర్వాత ఇరుకుటుంబాల అంగీకారంతో 2016, ఏప్రిల్ 12న వైభవంగా పెళ్లి చేసుకున్నారు. వరకట్నం కింద సంతోష్‌కుమార్‌కు రూ.15లక్షలు చెల్లించారు. పెళ్లైన కొన్నాళ్లకు ఉద్యోగా రీత్యా సంతోష్‌‌కుమార్ భార్య అమెరికా వెళ్లడంతో ఈజీ డబ్బు కోసం కక్కుర్తి పడి లక్షల్లో డబ్బు గుంజాడు.

హర్షవర్ధన్‌రెడ్డిగా పేరు మార్చుకొని నకిలీ మెయిల్ ఐడీ క్రియేట్ చేసిన సంతోష్‌కుమార్ అమెరికాలో ఉంటున్న తన భార్యకు అసభ్య సందేశాలు, ఇద్దరు కలిసి ఏకాంతంగా ఉన్న ఫోటోలు పంపుతూ డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో భయపడిపోయిన ఆ మహిళ ఈ విషయాన్ని తన భర్త సంతోష్‌కు చెప్పింది. అప్పుడు మరో కొత్త నాటకానికి తెరలేపిన సంతోష్‌ ఈ విషయాన్ని డీల్ చేస్తానంటూ భార్య, ఆమె తండ్రి నుంచి దాదాపు రూ.63లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. ఇదే క్రమంలో ఎక్కువ డబ్బులు అడుగుతుండటంతో అనుమానం వచ్చిన ఆ మహిళ అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చి భర్త సంతోష్‌కుమార్‌పై గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణలో సంతోష్‌కుమార్ చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితునిపై 498-ఏ, 323, 406, 419, 506, 509, సెక్షన్ల కింద నమోదు చేశారు. సంతోష్‌ని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు మాదాపూర్ ఏసీపీ శ్యాం ప్రసాద్ తెలిపారు.

Advertisement

Next Story