- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్య అలా అడిగిందని ముక్కు కోసిన భర్త.. ఆ తర్వాత ఏం చేశాడంటే..?
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో రోజురోజుకు గృహహింస కేసులు ఎక్కువైపోతున్నాయి. కట్నం కోసం కొందరు, అనుమానంతో కొందరు, మద్యం మత్తులో కొందరు భార్యలను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. మరికొందరు ఇంకా క్రూరంగా ప్రవరిస్తున్నారు. తాజాగా భార్య పుట్టింటికి వెళ్తానందని ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు ఓ భర్త. కోపంలో విచక్షణ మరిచి భార్య ముక్కును కత్తితో దారుణంగా కోసేశాడు. ఈ ఘటన రాజస్థాన్ లో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. లునావాస్ గ్రామానికి చెందిన భూమా రామ్‌కి పూనమ్ దేవి (25) కి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. మొదట్లో భార్యపై ప్రేమగా ఉన్న భూమా రామ్ రానురాను ఆమెను వేధించసాగాడు. నిత్యం భార్యాభర్తల మధ్య ఏదో ఒక గొడవ జరుగుతుండేది. ఈ నేపథ్యంలోనే పుట్టింటికి వెళ్లాలని ఉందని భార్య కొన్ని రోజుల నుంచి భర్త భూమాను కోరుతోంది. అయితే భార్యను పంపించడం ఇష్టంలేని భూమా ఇప్పుడు కాదు కొన్నిరోజులు ఆగి వెళ్లు అని చెప్పాడు. తన తల్లిదండ్రుల ఆరోగ్యం బాలేదని, వారిని చూడాలని ఉందని ఆమె పట్టుబట్టడంతో వారి మధ్య వాగ్వాదం నెలకొంది.
బుధవారం కూడా ఈ విషయమై భార్యాభర్తలు గొడవపడగా.. కోపోద్రక్తుడైన భూమా ఇంట్లో ఉన్న కత్తితో భార్య పూనమ్ దేవి ముక్కు కోసి పరారయ్యాడు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పూనమ్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త భూమా రామ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.