భార్యకు భర్త షాకింగ్ ప్రపోజల్.. నా ప్రియురాలితో కలిసి ఉందాం.. ఒప్పుకో

by Sumithra |   ( Updated:2021-05-28 06:24:58.0  )
భార్యకు భర్త షాకింగ్ ప్రపోజల్.. నా ప్రియురాలితో కలిసి ఉందాం.. ఒప్పుకో
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎంతో ఇష్టపడి పెళ్లిచేసుకొన్న ఆ భార్యకు ఆమె భర్తే సర్వస్వము.. అయితే ఆ ప్రేమ భర్తకు ఆమె మీద లేదని భార్యకు కొన్నేళ్ళకే అర్దమయ్యింది.కానీ , పెళ్లిచేసుకున్నందుకు అతనితో ఉండక తప్పలేదు. రోజు భర్త పెట్టె చిత్రహింసలు భరిస్తూనే వస్తోంది. అయితే ఒకరోజు భర్త ఆగడాలు మరింత ఎక్కువయ్యాయి. తన ప్రియురాలిని తీసుకొస్తానని, ముగ్గురం కలిసి ఉందామని భర్త చెప్పడంతో ఒక్కసారిగా అవాక్కయ్యింది. అందుకు ఆమె ససేమిరా అనడంతో భర్త ఆమెపై విరుచుకుపడ్డాడు. చేతికి ఏది దొరికితే అది విసురుతూ ఆమెపై దాడి చేశాడు. దీంతో భర్త వేధింపులు తట్టుకోలేని భార్య పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళితే..

మధ్యప్రదేశ్ లోని ఇటార్సీకి చెందిన ఓ వ్యక్తి (38) ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. అతనికి గతంలోనే వివాహం కాగా.. అదే గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం నడిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రియురాలిని ఇంటికి తీసుకురావడానికి పక్కా ప్లాన్ వేశాడు. డైరెక్ట్ గా భార్య వద్దకు వెళ్లి తన ప్రియురాలిని ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకోవాలని, ముగ్గురం కలిసి ఒకే ఇంట్లో సంతోషంగా ఉండొచ్చని చెప్పాడు. మొదట ఆ మాట విని షాక్ అయిన భార్య అందుకు ససేమిరా అన్నది. దీంతో భార్యపై కోపం పెంచుకున్న భర్త ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. ప్రియురాలిని ఇంటికి తీసుకురాడానికి ఒప్పుకోవాలని ఆమెపై దాడికి పాల్పడ్డాడు. దీంతో భర్త వేధింపులు తట్టుకోలేని భార్య పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story