- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్య వేరొకరితో ఎఫైర్ పెట్టుకుని.. ఎంత బ్రతిమిలాడినా తనవద్దకు రావట్లేదని ఉరేసుకున్న భర్త
దిశ, వెబ్ డెస్క్: కొంతమంది అన్నీ మరిచిపోయి ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుని అమాయకులైన తమ వాళ్లను బలి పశువులను చేస్తున్నారు. వీరి వల్ల ఇంకొంతమంది అనాథలుగా మారుతున్నారు. అంతేకాదు.. తప్పుకు కారణమైనవారే తిరిగి ఆత్మహత్య చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త సూసైడ్ చేసుకున్నాడని తెలిసి భార్య కూడా ఆత్మహత్య చేసుకుంది. దీంతో వారికి పుట్టిన నాలుగేళ్ల బిడ్డ అనాథగా మారిపోయింది.
మధ్యప్రదేశ్ లోని భోపాల్ టీటీ నగర్ కు చెందిన గొల్లు బలన్(25)-సుధ(22)లు భార్యాభర్తలు. వీరికి వివాహం జరిగి ఏడేళ్లవుతోంది. అదేవిధంగా వీరికి ఒక కొడుకు పుట్టాడు. ఇప్పటివరకు ఇదంతా బాగానే ఉంది. కానీ, ఇటీవల భార్య సుధకు సాగర్ బాబా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలిసిన భర్త తన భార్యను నిలదీశాడు. దీంతో వారిద్దరి మధ్య కొద్దిరోజుల నుంచి గొడవలు ప్రారంభమయ్యాయి. ఇదే క్రమంలో ఒకరోజు వారిద్దరి మధ్య గొడవ కావడంతో సుధ తన తల్లిగారింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి అతను ఈ గొడవలు పరిష్కరించేందుకు చాలా ప్రయత్నించాడు. అయినా ఫలితంలేకపోయింది. దీంతో అతను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి భార్య సుధ కూడా ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యాభర్తల చావుకు కారణమైన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.