- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్యభర్తల పాడుపని.. రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు చిక్కి..
దిశ, కోదాడ : గంజాయిని ఏపీ నుంచి తెలంగాణ మీదుగా బెంగళూరుకు తరలిస్తున్న భార్యాభర్తలను కోదాడ రూరల్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రూరల్ సీఐ శివరాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం పల్లెపాడుకు చెందిన బొంత చంద్రమౌళి, లక్ష్మమ్మ భార్యాభర్తలు. స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆ డబ్బులు సరిపోకపోవడంతో గంజాయి వ్యాపారం చేసే వారిని పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత వారిచ్చిన సమాచారం మేరకు ఏపీలోని విశాఖపట్నంలో నగేష్ వద్ద గంజాయి కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో అమ్ముకునే వారు. దీంతో వీరిపై గతంలో నాలుగు కేసులు నమోదై జైలు జీవితం కూడా గడిపారు.
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు హైదరాబాదులోని నాగోల్‌కు మకాం మాచ్చి, అక్కడ నుంచి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఎప్పటిలాగే ఈ నెల 9న విశాఖపట్నం నుంచి గంజాయిని తీసుకొని వస్తుండగా కోదాడ మండలం కొమరబండ శివారులో వాహనాలు తనిఖీల్లో పట్టుబడ్డారు. ఆర్టీసీ బస్‌లో 32 కిలోల గంజాయిని తరలిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. వారిని అదుపులోకి తీసుకుని మంగళవారం కోర్టులో హాజరు పరిచిపట్లు సీఐ తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా వ్యవహరించిన రూరల్ ఎస్ఐ సైదులు గౌడ్, సిబ్బందిని డీఎస్పీ రఘు అభినందించినట్లు తెలిపారు.