- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కాటుకు నిన్న భార్య నేడు భర్త మృతి
దిశ, హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కందుగులలో విషాదం చోటుచేసుకుంది. కరోనా మహమ్మారితో శనివారం వంగోజు వజ్రమ్మ (65) అనే వృద్ధురాలు మృతి చెందగా ఆదివారం ఆమె భర్త వంగోజు రాజయ్య (70) మృతి చెందాడు. భార్య భర్తలు ఇద్దరు ఒకరోజు వ్యవధిలోనే కరోనా కారణంగా మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామ పంచాయతీ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి మృత దేహాలకు అంత్య క్రియలు నిర్వహించారు.
కరోనా మహమ్మారి కుటుంబాలను కబళిస్తుండడంతో బాధిత కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకవైపు ప్రయివేటు ఆసుపత్రుల్లో బిల్లులు చెల్లించి చికిత్స పొందలేక, మరో వైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక చాల మంది ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వల్ల ఆర్థికంగా చితికిపోవడంతో పాటు విలువైన కుటుంబ సభ్యుల ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు కోలుకోలేనంతగా దెబ్బటంటున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.