- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వన్యప్రాణులను హతమార్చిన వేటగాళ్లు.. చివరికి..?
దిశ, అచ్చంపేట : జిల్లాలోని అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీప్రాంతం లో కొందరు వ్యక్తులు వన్యప్రాణులను వేటాడి హతమారుతున్నట్లు స్థానిక అటవీశాఖ అధికారులు సోమవారం గుర్తించారు. వన్యప్రాణులు అడవి నుండి పంట పొలాలకు వస్తుండగా అదే అదునుగా వేటగాళ్లు ఉచ్చులు, విద్యుత్ షాకులతో వన్యప్రాణులను హత మారుస్తున్నారు. ఈమేరకు మండలంలోని వెంకటేశ్వర్ల బావి గ్రామ శివారు ప్రాంతమైన పురుగుల గుట్ట వద్ద వన్యప్రాణులను హతమార్చారు. ఈ విషయం అటవీశాఖ అధికారులకు తెలియడంతో ఘటన స్థలానికి చేరుకున్నారు.
సంఘటన స్థలంలో ఉన్న నలుగురు వ్యక్తులలో ఇద్దరు పట్టుబడినట్లు, మరో ఇద్దరు పరారైనట్లు సమాచారం. పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు కూడా వెంకటేశ్వర్ల బావి గ్రామానికి చెందిన వారుగా అధికారులు గుర్తించారు. మిగతా వారిని కూడా గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై అమ్రాబాద్ అటవీ క్షేత్ర అధికారిని అర్చనను ‘దిశ’ చరవాణి ద్వారా వివరణ కోరగా… ఆమె మాట్లాడుతూ వన్య ప్రాణులను వేటగాళ్లు హతమార్చింది నిజమేనని, పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామని, మంగళవారం నిందితులతో పాటు పూర్తి సమాచారం తెలుపుతామని వివరించారు.