- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
31జిల్లాల్లో హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్లు
దిశ, క్రైమ్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా 31జిల్లాల యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ పోలీస్ యూనిట్లను ఉమెన్ సేఫ్టి వింగ్ ఏర్పాటు చేసింది. తరుణి స్వచ్ఛంద సంస్థ, బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ (హైదరాబాద్) సహకారంతో ఉమెన్ సేఫ్టి వింగ్ ఈ యూనిట్లను నెలకొల్పింది. ఈ మేరకు జిల్లాల యూనిట్లకు రెండ్రోజుల ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి శిక్షణ హ్యాండ్ బుక్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. రెండ్రోజుల శిక్షణా కార్యక్రమంలో సైబర్ ట్రాఫికింగ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్, ప్రీ రెస్క్యూ, పోస్ట్ రెస్క్యూ ప్రోటోకాల్స్, హుమన్ ట్రాఫికింగ్- లీగల్ ఫ్రేమ్ వర్క్ తదితర అంశాలను బోధించారు. డీఐసీ సుమతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూపీ సైబర్ క్రైమ్ ఎస్పీ త్రివేణి సింగ్, రిటైర్డ్ ఐపీఎస్ ఉమాపతి, రాచకొండ యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ విభాగం ఇన్ స్పెక్టర్ చంద్రశేఖర్, జానకీరెడ్డి, రమేష్, అడ్వకేట్ రోజెదార్, డాక్టర్ శేఖర్ శేషాద్రి, రేణుక, తరుణి వ్యవస్థాపకులు మమత రఘువీర్ పాల్గొన్నారు.