- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీస్ స్టేషన్ పైకెక్కి యువకుడు హల్ చల్
దిశ, నాగర్ కర్నూలు : అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూప్‌లో చాటింగ్ చేశారన్న నెపంతో ఓ యువకుడిని పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. దీంతో విసిగివేసారిన సదరు యువకుడు పోలీస్ స్టేషన్ పైకి ఎక్కి కిందికి దూకి ఆత్మహత్య యత్నానికి చేసుకుంటానని హల్ చల్ చేసిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా కొల్లపూర్ నియోజకవర్గం కోడేరు మండల పోలీస్ స్టేషన్‌లో జరిగింది.
గత కొంత కాలంగా కోడూరు గ్రామంలో అవినీతి అక్రమాలు పెరిగిపోతున్నాయని అభివృద్ధి జరగకుండానే ఉత్తమ సర్పంచ్ ప్రశంసలు పొందడం విడ్డూరంగా ఉంది అంటూ వాట్సాప్ గ్రూపులో టీఆర్ఎస్ లీడర్, కాంట్రాక్టర్ రఘునందన్ రెడ్డిపై మల్లేష్ అనే యువకుడు పోస్టు పెట్టాడు. దీంతో వేపచెట్టు లాలూ అనే వ్యక్తి ఫోన్ చేసి దూషించడంతో పాటు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అండతో పోలీసులతో బెదిరింపులకు దిగి ఇబ్బందులకు గురి చేశారని మనస్తాపం చెంది బాధితుడు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం చర్చనీయాంశమైంది.
మంగళవారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ పైకెక్కి దూకేస్తానని హల్ చల్ చేయడంతో అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది తనను పట్టుకొని కిందికి దించారు. దీనిపై ఎస్ఐ కృష్ణయ్య వివరణ ఇస్తూ ఇరువురు యువకులు ఫోన్‌లో తిట్టుకోవడం జరిగిందని లాలూ అనే యువకుడు మల్లేష్‌పై ఫిర్యాదు చేయగా పిలిచి సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఇంతలో స్టేషన్ పైకి ఎక్కి ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్లు తెలిపారు. కాగా ఇరువురూ రాజీపడ్డారని పేర్కొన్నారు.