హెచ్‌యూఎల్ త్రైమాసిక లాభం రూ.1,974 కోట్లు

by Harish |
హెచ్‌యూఎల్ త్రైమాసిక లాభం రూ.1,974 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరనికి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్(హెచ్‌యూఎల్) నికర లాభం 8.6 శాతం పెరిగి రూ.1,974 కోట్లుగా వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 1,818 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ అమ్మకాల ఆదాయం రూ. 11,510 కోట్లుగా ఉందని, ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ. 10,223 కోట్లతో పోలిస్తే 15.19 శాతం వృద్ధి సాధించినట్టు కంపెనీ తెలిపింది.

కంపెనీ బోర్డు ప్రతి షేర్‌కు రూ. 14 మధ్యంతర డివిడెంట్‌ను ప్రకటించినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ‘ ప్రస్తుతం సవాళ్లను ఎదుర్కొంటున్న వాతావరణంలో తాము పోటీని ఎదుర్కొని వృద్ధిని లాభదాయకంగా ఉన్నాము. అలాగే, ప్రజలకు మెరుగైనా సేవలను అందించేందుకు నాణ్యమైన పనితీరును కనబరుస్తున్నామని హెచ్‌యూఎల్ సీఎండీ సంజీవ్ మెహతా చెప్పారు. కంపెనీ కార్యకలాపాలు, సర్వీసులు కరోనాకు ముందునాటి స్థాయికి చేరుకున్నాయని, అలాగే, మారిన పరిస్థితులకు అనుగుణంగా కంపెనీ కార్యకలాపాలను డిజిటైలైజ్ చేసే ప్రక్రియను వేగవంతం చేసినట్టు మెహతా తెలిపారు. ఆర్థిక ఫలితాల సందర్భంగా హెచ్‌యూఎల్ షేర్లు మంగళవారం 0.32 శాతం పెరిగి రూ. 2,185.80 వద్ద ముగిసింది.

Advertisement

Next Story

Most Viewed