హుజురాబాద్‌లో కేసీఆర్‌కు భారీ షాక్.. కొత్త సమస్య స్టార్ట్.!

by Sridhar Babu |
KCr
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్‌లో 1000 మందితో పోటీ చేయించి తీరుతామని ఉపాధి హామీ, ఫీల్డ్ అసిస్టెంట్లు స్పష్టం చేశారు. హుజురాబాద్‌లో ఆదివారం ఫీల్డ్ అసిస్టెంట్ల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రకారం హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి తీరాలని నిర్ణయించారు.

ప్రభుత్వం 2019 డిసెంబర్‌లో 4779 సర్క్యూలర్ జారీ చేసి రాష్ట్రంలోని 7500 ఫీల్డ్ అసిస్టెంట్లను రోడ్డున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్క్యూలర్ రద్దు చేయాలని తాము ఉద్యమిస్తే తమనే 2020 మార్చిలో ఉద్యోగాల నుంచి తొలగించారని ఫీల్డ్ అసిస్టెంట్ జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. 16 నెలలుగా ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని సమావేశంలో చర్చించారు.

ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలంటే ఉప ఎన్నికల్లో పోటీ చేయక తప్పడం లేదని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. హుజురాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే విధుల్లోకి తీసుకోవాలని, లేనట్టయితే ఉప ఎన్నికల్లో 1000 మందితో నామినేషన్లు వేయించాలని సమావేశంలో తీర్మానించారు. రాష్ట్రంలోని 7,500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు హుజురాబాద్‌లోనే మకాం వేసి టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా పని చేయాలని నిర్ణయించారు.

Advertisement

Next Story

Most Viewed