దంచికొట్టిన ఢిల్లీ.. గెలుపెవరిది?

by Anukaran |
దంచికొట్టిన ఢిల్లీ.. గెలుపెవరిది?
X

దిశ, వెబ్‌డెస్క్: షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా ఐపీఎల్ 16వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత బ్యాటింగ్ చేశారు. టాస్ ఓడి మైదానంలో దిగిన ఢిల్లీ ఆటగాళ్ల బ్యాటింగ్ అభిమానులను ఆకట్టుకుంది. ప్రత్యర్థి బౌలర్లు వేసే బంతులకు బౌండరీల వరద పారిస్తూ.. ఫీల్డింగ్‌లో ఉన్న ఆటగాళ్లను మైదానంలో పరిగెత్తించారు. నిర్ధిష్ఠ 20 ఓవర్లలో కేవలం 4 వికెట్ల నష్టానికి ఏకంగా 228 పరుగులు చేశారు.

ఇన్నింగ్స్ సాగిందిలా..

ఓపెనింగ్ దిగిన పృథ్వీ షా, శిఖర్ దావన్ క్రీజులో ఉన్నంత సేపు బ్యాటుకు పని చెప్పారు. 56 పరుగుల వద్ద ఔట్ అయిన గబ్బర్(26).. 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి పర్వాలేదనిపించాడు. ఇక అప్పటికే క్రీజులో నిలబడ్డ పృథ్వీ షా 35 బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత మొత్తం 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 66 పరుగులు చేసి 129 స్కోర్ బోర్డు వద్ద పెవిలియన్ చేరాడు.

అదే సమయంలో మంచి ఫామ్‌లో ఉన్న శ్రేయాస్ అయ్యార్‌కు.. మిడిలార్డర్‌లో రిషబ్ పంత్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. ఒకరికి ఒకరు పోటీగా బౌండరీల వర్షం కురిపిస్తూ.. కోల్‌కతా బౌలర్లను తలలు పట్టుకునేలా చేశారు. రిషబ్ పంత్ 17 బంతుల్లో 38 పరుగులు చేశాడు. 5 ఫోర్లు, 1 సిక్స్ బాది పెవిలియన్ చేరాడు. ఇక కెప్టెన్ శ్రేయాస్ మాత్రం చాకచక్యంగా ఆడుతూ.. సెంచరీ వైపు అతి వేగంగా దూసుకెళ్లాడు.
మొత్తం 38 బంతులు ఫేస్ చేసిన శ్రేయాస్.. ఆకాశమే హద్దుగా 7 ఫోర్లు, 6 సిక్సర్లు బాది 88 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చివరి రెండో ఓవర్‌లో వచ్చిన స్రోయినిస్ 1 పరుగు చేసి వెనుదిరిగాడు. ఆ స్థానంలో వచ్చిన హెట్మేయర్ 7 పరుగులు చేశాడు. ఢిల్లీ బ్యాట్స్‌మెన్లు రాణించడంతో స్కోరు బోర్డు 228/4 చేరింది. దీంతో 120 బంతుల్లో కోల్‌కతా 229 పరుగులు చేయాల్సి ఉంది.

స్కోరు బోర్డు:

Delhi Capitals Innings: పృథ్వీ షా (c) శుబ్‌మన్ గిల్ (b) నాగర్‌కోటి 66(41) శిఖర్ దావన్ (c) మోర్గాన్ (b) వరుణ్ చక్రవర్తి 26(16), శ్రేయాస్ అయ్యర్ (c)నాటౌట్ 88(38) రిషబ్ పంత్ (wk)(c) శివం మావి (b) ఆండ్రూ రస్సెల్ 38(17), మార్క్యూస్ స్టోయినిస్ (c) వరుణ్ చక్రవర్తి (b) ఆండ్రూ రస్సెల్ 1(2), హెట్మేయర్ నాటౌట్ 7(5) ఎక్స్‌ట్రాలు 2 మొత్తం స్కోరు 228/4

వికెట్ల పతనం: 56-1 (శిఖర్ దావన్, 5.5), 129-2 (పృథ్వీ షా, 12.4), 201-3 (రిషబ్ పంత్, 17.5), 221-4 (మార్క్యుస్ స్టోయినిస్, 19.1)

బౌలింగ్: ప్యాట్ కమ్మిన్స్ 4-0-49-0, శివం మావి 3-0-40-0, వరుణ్ చక్రవర్తి 4-0-49-1, సునీల్ నరైన్ 2-0-26-0, ఆండ్రూ రస్సెల్ 4-0-29-2, కమలేష్ నాగర్‌కోటి 3-0-35-1.

Advertisement

Next Story