- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రూ.15 కోట్లతో పరారైన అంజలి
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్టలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. చిట్టీల వ్యాపారం పేరుతో రూ.15 కోట్ల రూపాయలకు టోపి పెట్టారు ఓ మహిళా నిర్వాహకురాలు అంజలి. స్థానికంగా ఉంటూ.. జనాల్లో నమ్మకం కలిగించి, చిట్టీలు వేయించి చివరకు హ్యాండ్ ఇచ్చి పరారయ్యారు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సుమారు వందమంది నుంచి డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. విషయం తెలిసిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును చంద్రాయణగుట్ట పోలీసులు సీసీఎస్‌కు బదిలీ చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు పరారైన నిర్వాహకురాలు అంజలి కోసం గాలిస్తున్నారు.
Next Story