కన్‌స్ట్రక్షన్ సైట్‌లో ప్రత్యక్షమైన భారీ మొసలి..

by Sujitha Rachapalli |
కన్‌స్ట్రక్షన్ సైట్‌లో ప్రత్యక్షమైన భారీ మొసలి..
X

దిశ, ఫీచర్స్ : గుజరాత్, వడోదరలోని కెలన్‌పూర్ ఏరియాలో గల కన్‌స్ట్రక్షన్ సైట్ వద్ద భారీ మొసలి ప్రత్యక్షమైంది. 11 అడుగుల పొడవున్న ఈ భారీ జలచరం ఆహారాన్వేషణలో భాగంగా మురికి కాలువ నుంచి బయటకు వచ్చినట్లు వైల్డ్ లైఫ్ రెస్క్యూ ట్రస్ట్ సభ్యుడు అరవింద్ పవార్ చెప్తున్నారు. కన్‌స్ట్రక్షన్ సైట్ వద్ద పనులు చేస్తుండగా తమకు క్రొకడైల్ కనిపించిందని, వెంటనే వైల్డ్ లైఫ్ రెస్క్యూ టీమ్‌కు సమాచారమిచ్చామని సైట్ సిబ్బంది చెప్పారు. మొసలిని కన్‌స్ట్రక్షన్ సైట్ నుంచి బయటకు తీసి అటవీశాఖకు అప్పజెప్పినట్లు రెస్క్యూ ట్రస్ట్ సభ్యుడు అరవింద్ వెల్లడించారు.

Next Story

Most Viewed