- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
థర్డ్ వేవ్‌లో ఊహకందని కేసులు.. ప్రభుత్వానికి టాస్క్‌ఫోర్స్ కమిటీ నివేదిక వెల్లడి!
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా థర్డ్ వేవ్ విస్తృతిపై ఏపీ ప్రభుత్వానికి టాస్క్‌ఫోర్స్ కమిటీ నివేదిక సమర్పించింది.16 పేజీలతో కూడిన ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన కమిటీ అందులో భవిష్యత్ పరిణామాలను పేర్కొన్నది. మూడో దశలో సుమారు 18 లక్షల మందికి కరోనా సోకవచ్చని వెల్లడించింది. అంతేకాకుండా థర్డ్ వేవ్‌లో నాలుగున్నర లక్షల మంది చిన్నారులకు ముప్పు పొంచి ఉందని కమిటీ నివేదిక స్పష్టం చేసింది.
దాదాపు 36వేల మంది చిన్నారులు ఆస్పత్రుల్లో చేరే అవకాశం ఉందని సూచనలు చేసింది. 9 వేల మంది చిన్నారులకు ఐసీయూ చికిత్స అవసరం పడొచ్చని, మూడో దశ పీక్ స్టేజీలో రోజుకు 533 మంది చిన్నారులు ఆస్పత్రుల్లో చేరే అవకావం ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఆస్పత్రుల్లో చేరే చిన్నారుల కోసం 2750 పడకలు అవసరం. చిన్నపిల్లల కోసం 700 వెంటిలేటర్లు సిద్దం చేసుకోవాలని ప్రభుత్వానికి ముందుగానే టాస్క్‌ఫోర్స్ కమిటీ సూచించింది.