- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ మ్యాచ్‌కు భారీగా రేట్లు పెట్టినా యాడ్లు ఇస్తున్నారంట
దిశ, స్పోర్ట్స్: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ ఒమన్, యూఏఈ వేదికగా అక్టోబర్ 10 నుంచి ప్రారంభం కానున్నది. తొలుత ఒమన్‌లో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగనుండగా.. ఆ తర్వాత యూఏఈలో సూపర్ 12 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. దాయాది దేశాలైన ఇండియా – పాకిస్థాన్ మధ్య ఈ నెల 24న దుబాయ్ వేదికగా లీగ్ మ్యాచ్ జరుగనున్నది. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఇరు జట్లు ఇప్పటివరకు మరో మ్యాచ్ ఆడలేదు. దీంతో ఈ లీగ్ మ్యాచ్‌పై అందరి దృష్టి పడింది. ఇప్పటికే మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. ఇక ఈ మ్యాచ్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని స్టార్ స్పోర్ట్స్ భారీగా యాడ్ రేట్లు నిర్ణయించింది. సాధారణ మ్యాచ్‌ల సమయంలో 10 సెకెన్ల యాడ్ రూ. 12 లక్షల నుంచి రూ. 18 లక్షల వరకు ఉన్నది. అయితే ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్‌కు మాత్రం 10 సెకెన్ల యాడ్ రేటు రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు నిర్ణయించింది. ఈ మ్యాచ్‌కు ఉండే ప్రాధాన్యత బట్టే భారీ రేట్లు ఫిక్స్ చేసినట్లు తెలుస్తున్నది. అయినా సరే ప్రకటనకర్తలు వెనక్కు తగ్గడం లేదు. భారీ రేట్లు పెట్టినా యాడ్లు కుమ్మరిస్తున్నారు.