- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షారుఖ్ తనయుడికి సపోర్ట్‌గా హృతిక్.. ఇదంతా తాత్కాలికమే
దిశ, సినిమా: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ షారుఖ్ కుటుంబానికి మద్ధతుగా నిలిచాడు. సోషల్ మీడియా వేదికగా ఆర్యన్ ఖాన్ గురించి స్పెషల్ నోట్ రిలీజ్ చేసిన హృతిక్.. లైఫ్‌ను స్ట్రేంజ్ రైడ్‌గా అభివర్ణించాడు. జీవితం చాలా గొప్పది ఎందుకంటే ఇది అనిశ్చితంగా ఉంటుంది. దేవుడు దయగలవాడు కష్టాలను తట్టుకోగల వారికే పరీక్షలు పెడుతాడని చెబుతూ.. ‘మై డియర్ ఆర్యన్ కోపం, నిస్సహాయత, కన్‌ఫ్యూజన్ ఇప్పుడు నిన్ను సతమతం చేస్తున్నాయి. కానీ, ఇవే నీలోని నిజమైన హీరోను బయటకు తీసుకురాగలవు. జాగ్రత్త ఇవే ప్రేమ, దయ, కరుణ లాంటి గొప్ప గుణాలను కూడా కాల్చేయగలవు. మిస్టేక్స్ చేయడం, ఫెయిల్ కావడం, విక్టరీస్ చూడటం, సక్సెస్ అందుకోవడం అన్నీ కూడా సేమ్. కానీ, ఏది నీ దగ్గర భద్రంగా ఉంచుకోవాలనేది ఎక్స్‌పీరియన్స్ నుంచి నేర్చుకోవాలి. ప్రతీ అనుభవాన్ని సొంతం చేసుకుని గొప్పగా ఎదగాలి. నన్ను నమ్ము స్ట్రగుల్స్ అనేవి గొప్ప బహుమతులు. కామ్‌గా ఉండు. అన్నీ అబ్జర్వ్ చెయ్. అద్భుతమైన సూర్యకాంతిని చూసే ముందు చీకటిని ఎదుర్కోక తప్పదు’ అంటూ ఆర్యన్‌లో ధైర్యం నింపాడు హృతిక్.