ముంబై పోలీస్‌ ఐడియాకు హృ‌తిక్ ఫిదా

by Shyam |
ముంబై పోలీస్‌ ఐడియాకు హృ‌తిక్ ఫిదా
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచానికి కరోనా మహమ్మారి విపత్తులా మారింది. ఈ విపత్తును ఎదుర్కునేందుకు దేశంలోని పోలీసు అధికారులు, వైద్య బృందాలు, పారిశుధ్య కార్మికులు కంటికి కనపడని శత్రువుతో ప్రత్యక్ష పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండేందుకు పోలీసులు కొన్ని చోట్ల లాఠీలు ఝుళిపిస్తే … మరికొన్ని చోట్ల పాటలు పాడి మరీ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. మొత్తానికి వారి లక్ష్యం ఒక్కటే .. ప్రజలను కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలని. ఈ క్రమంలోనే ఏప్రిల్ ఫూల్స్ డే రోజు ముంబై పోలీసులు సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ఆకట్టుకుంటోంది. జూమ్ చేసి చూడండి… మీకు సంబంధించిన రహస్య సమాచారం మాకు అందింది అని చెక్ చేసుకోవాలని చెప్పారు. ఆ పోస్ట్ కాస్త జూమ్ చేస్తే… మూర్ఖంగా(ఫూల్స్‌గా) ఉండకండి.. సామాజిక దూరాన్ని పాటించండి అనే మెస్సేజ్ ఉంది.

ఈ పోస్ట్ చాలా మంది నెటిజన్లను ఆకర్షించగా.. బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్‌ ఫిదా అయ్యాడు. ముంబై పోలీసుల క్రియేటివిటీ నచ్చిందని… ఇలాంటి సీరియస్ ఇష్యూస్‌పై కూడా ఇలా కామెడీ వేలో ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పొచ్చన్న విషయం ఇప్పుడే అర్ధం అవుతుందని అభినందించారు.


Tags: Mumbai Police, Hrithik Roshan, CoronaVirus, Covid19

Advertisement

Next Story