- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హృతిక్ 'దాదా'గా బయోపిక్
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్‌ల కాలం నడుస్తుంది. ముఖ్యంగా క్రికెటర్ల బయోపిక్స్ హిట్ ఖాతాలో చేరుతున్నాయి. ఇప్పటికే సచిన్, ధోని బయోపిక్స్ ప్రేక్షకులను అలరించగా…. 83 పేరుతో కపిల్ దేవ్ జీవిత కథ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ కపిల్ పాత్రను పోషిస్తుండగా… ఆయన సతీమణి పాత్రను దీపికా పడుకోన్ చేస్తోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్ అదిరిపోయింది. అంతేకాదు మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ బయోపిక్‌లో తాప్సీ నటిస్తుండగా శభాష్ మిథూ పేరుతో మూవీ సిద్ధమవుతోంది.
బాలీవుడ్‌లో మరో క్రికెటర్ బయోపిక్‌కు ప్లాన్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ క్రికెట్ సత్తా చాటిన సౌరవ్ గంగూలీ బయోపిక్ తెరమీదకు వస్తున్నట్లు సమాచారం. కరణ్ జోహార్ నిర్మించనున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ దాదా పాత్రలో కనిపించనున్నాడట. గంగూలీ, హృతిక్‌ను కలిసి ఇప్పటికే చర్చించిన కరణ్… త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉందట.