గణేష్.. నా ఫేవరెట్ గాడ్ : హృతిక్

by Anukaran |   ( Updated:2023-03-31 16:21:16.0  )
గణేష్.. నా ఫేవరెట్ గాడ్ : హృతిక్
X

దిశ, వెబ్‌డెస్క్ : వినాయక చవితి వచ్చిందంటే సెలెబ్రిటీల ఇళ్లల్లో సందడే సందడి. బాలీవుడ్ గురించి అయితే చెప్పక్కర్లేదు. తమ ఇంట్లో గణేషున్ని ప్రతిష్టించడమే కాక తోటి సెలెబ్రిటీలను ఆహ్వానించి.. చాలా అద్భుతంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక వినాయక నిమజ్జనం కూడా ఏ లెవల్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ సారి కరోనా కారణంగా పెద్ద ఎత్తున వేడుకలు జరపకపోయినా సరే.. ఇంట్లో దేవుడిని ప్రతిష్టించి ఆశీర్వాదాలు అందుకున్నారు

కాగా, బాలీవుడ్ గ్రీకు దేవుడు హృతిక్ రోషన్ ఇంట్లోనూ వినాయకుడిని ప్రతిష్టించారు. మంగళవారం నిమజ్జనం ఉండటంతో చివరి రోజు పూజ నిర్వహించి దేవుడి ఆశీర్వాదం పొందారు. కార్యక్రమంలో తన మాజీ భార్య సుషానే, పిల్లలు, తండ్రి రాకేష్ రోషన్‌తో పాటు చాలా దగ్గరి బంధువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోస్ట్ పెట్టిన హృతిక్.. వినాయక చవితి పండుగ తన చిన్నతనాన్ని గుర్తుకు తెస్తుందని తెలిపాడు. పండుగలన్నీ కూడా కుటుంబీకులు, స్నేహితులతో కలిసి జరుపుకుంటుంటే మనలోని చిన్న పిల్లవాడిని కొత్తగా పరిచయం చేస్తాయని అన్నారు. మతం కంటే ప్రేమకే ఎక్కువ ఓటు వేస్తారని తెలిపిన హృతిక్.. తను చిన్నప్పుడు ఏం కోరుకున్నాగణేశుడు వెంటనే ఇచ్చేవాడని తెలిపారు. ఇప్పుడు కూడా అలాగే చేస్తాడని నమ్ముతున్నట్లు చెప్పాడు. గణేష్ తన ఫేవరెట్ గాడ్ అని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story