జవాన్లకు ఇచ్చే గౌరవం ఇదేనా ? : హెచ్‌ఆర్సీ

by Anukaran |
జవాన్లకు ఇచ్చే గౌరవం ఇదేనా ? : హెచ్‌ఆర్సీ
X

దిశ, సంగారెడ్డి: దేశం కోసం జవాన్లు సరిహద్దులో పగలు, రాత్రి అని తేడా లేకుండా యుద్ధాలు చేస్తుంటారు. రక్తం గడ్డకట్టే చలిలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎక్కడి నుండి దాడులు ఎదురవుతాయో తెలియదు. అయినా కూడా జవాన్లు వెన్ను విరవకుండా వీరోచిత పోరాటం చేస్తారు. అలాంటి సైనికులకి మనం ఎంత చేసిన తక్కువే. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అంతటి వీరుల కుటుంబాలకు కూడా న్యాయం జరగుతుంది. అమరులైన జవాన్ల కుటుంబానికి సాయం అందడంలోనూ నిర్లక్ష్యమే జరుగుతుంది.

సంగారెడ్డికి చెందిన విజయకుమార్ 1999 కార్గిల్ యుద్ధంలో అమరుడయ్యాడు. సైన్యంలో చేరిన ఏడేళ్లకే వీరమరణం పొందాడు. 21 ఏళ్లుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తోంది. కార్గిల్ యుద్ధంలో విజయకుమార్ వీర మరణం పొందినప్పటినుండి ఆయన కుటుంబం ఎలాంటి సాయానికి నోచుకోలేదు.

1999లో అప్పటి ప్రభుత్వం విజయకుమార్ కుటుంబానికి ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఇచ్చిన హామీ ఇంతరవకు ఆచరణలో ఆమలు కాలేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ జవాన్ కుటుంబ సభ్యులు కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. దేశం కోసం తన బిడ్డ ప్రాణత్యాగం చేస్తే కనీసం పట్టించుకునే నాథుడే లేడని ఆ కుటుంబం కన్నీరు పెట్టుకుంది. తాజాగా ఆ కుటుంబం ఆవేదనను తెలుచుకున్న మానవ హక్కుల సంఘం దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.

Advertisement

Next Story