కొర్రమీను చేపల పులుసు రెసిపీ

by Hamsa |
కొర్రమీను చేపల పులుసు రెసిపీ
X

కావాల్సిన పదార్థాలు:

కొర్రమీను చేపలు -అర కేజీ
ఉల్లిపాయ -2
పచ్చిమిర్చి -3
కారం – 2 టీస్పూన్స్
పసుపు -అర టీస్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ట్ -2 టీస్పూన్స్
ధనియాల పొడి -2 టీస్పూన్
గరంమసాలా -పావు టీస్పూన్
జీలకర్ర పొడి -పావు టీస్పూన్
మెంతి పొడి -అర టీస్పూన్
చింతపండు -కొద్దిగా
నూనె -సరిపడా
ఉప్పు -రుచికి తగినంత
కరివేపాకు -2 రెమ్మలు
కొత్తిమీర -1 కట్ట
నీళ్లు -1 కప్పు (గ్రేవి కావాలి అనుకుంటే)

తయారీ విధానం:

మొదటగా కొర్రమీను చేపలను ఉప్పుతో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలను ఒక బౌల్‌లోకి తీసుకుని అందులో చింతపండు రసం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, మెంతిపొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అరగంట పాటు నానబెట్టుకోవాలి. చేప ముక్కలకు మసాలా పట్టుకుంటే ఎంతో టెస్టీగా ఉంటుంది.

ఇప్పుడు ఒక పాన్‌లో నూనె వేసుకుని అది వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక ముందుగా నానబెట్టుకున్న చేప ముక్కల మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీనిలో కరివేపాకు, ఉప్పు వేసి సన్నని మంటపై ఉడికించుకోవాలి. గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. చేపల ముక్కలు ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే కొర్రమీను చేపల పులుసు రెడీ..

నోరూరించే బోటీ పులుసు..!

Advertisement

Next Story