అల్లం అవకాయ..!

by Shyam |
అల్లం అవకాయ..!
X

కావలసిన పదార్థాలు:

మామిడికాయ ముక్కలు – ఒక కేజీ
అల్లం ముద్ద – 125 గ్రాములు
వెల్లుల్లి ముద్ద – 125 గ్రాములు
నువ్వుల నూనె – పావు లీటర్
ఉప్పు – 250 గ్రాములు
కారం – 125 గ్రాములు
పసుపు – 25 గ్రాములు
జీలకర్ర పొడి – 50 గ్రాములు
మెంతిపొడి – 10 గ్రాములు
ఇంగువ – కొద్దిగా
ఆవాలు, జీలకర్ర, మెంతులు -టీస్పూన్‌

తయారీ చేసే విధానం:

మామిడికాయ ముక్కలను ముందుగా కడుక్కుని తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఉప్పు, పచ్చళ్ల కారం పొడి, జీలకర్ర పొడి, మెంతిపొడి, పసుపు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరో గిన్నెలో నూనె వేడి చేసి దానిలో ఇంగువ వేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి కాస్త ఎర్రబడిన తర్వాత దింపేయాలి. తర్వాత నూనె చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం, వెల్లుల్లి ముద్దలను వేసి కలపాలి. నూనె పూర్తిగా చల్లారిన తర్వాత కలిపి ఉంచుకున్న మసాలా పొడులు వేసి కలుపుకోవాలి. అందులో మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపి జాడీలోకి తీసుకోవాలి. అనంతరం మూడు రోజుల తర్వాత ఇంకోసారి కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే అల్లం అవకాయ పచ్చడి రెడీ.

Advertisement

Next Story