ఫోన్ కెమెరాలో చంద్రున్ని క్యాప్చర్ చేయొచ్చా?

by Sujitha Rachapalli |   ( Updated:2021-07-13 04:11:49.0  )
moon
X

దిశ, ఫీచర్స్ : పున్నమి రాత్రిన నిండు చంద్రున్ని చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. ఆ జాబిల్లి అందాలను మొబైల్ కెమెరాల్లో బంధించాలని పించగానే వెంటనే ఫుల్ మూన్‌ను ఫోన్లలో క్యాప్చర్ చేసి, సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసేందుకు సిద్ధమైపోతుంటాం. కానీ అంత దూరంలో ఉన్న చంద్రుడి క్లియర్ పిక్చర్‌ను పొందాలంటే టెలీఫొటో లెన్స్ వాడాల్సిందే లేదంటే ఫ్రేమ్‌లో సుదూరాన మిణుకు మిణుకుమంటున్న చుక్క రూపంలోనే కనిపిస్తాడు. పైగా రాత్రిపూట తీయడం ఇంకా కష్టం. ISO సెట్టింగ్ లేదా సెన్సిటివిటీ రేటింగ్‌ను మార్చేందుకు అనుమతించే ప్రొఫెషనల్ కెమెరాలతో అయితే ఫొటో క్వాలిటీ తగ్గకుండా లో లైట్ కండిషన్స్‌లోనూ షూట్ చేయవచ్చు.

స్మార్ట్ ఫోన్ కెమెరాను ఉపయోగించవచ్చా..?

సింపుల్‌గా చెప్పాలంటే యూజ్ చేయొచ్చు. కానీ, ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్‌ మొబైల్‌లోని కెమెరాను ఉపయోగించకుండా థర్డ్ పార్టీ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుని, వాటి ద్వారా చంద్రుని స్పష్టమైన ఫొటో తీయొచ్చు. ఇవి సెన్సిటివిటీ రేటింగ్‌ పెంచడంతో పాటు తక్కువ లైటింగ్‌ కండిషన్స్‌ను క్రియేట్ చేస్తాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. చంద్రుడిని సింగిల్‌గా కాకుండా పక్కన ఏదైనా ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు (వంతెన లేదా పర్వతాన్ని దాటుతున్నప్పుడు) ఫోటో తీసినట్టయితే వీక్షకుడికి మూన్ సైజ్ మరింత పెద్దదిగా కనిపిస్తుంది. అయితే ఈ యాప్స్ ద్వారా కూడా రిజల్ట్ విషయంలో కొంతవరకు డిజప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది.

https://i.guim.co.uk/img/media/af7f50e7d500dd072a1a8a68b4dfbdd7841ea2bc/493_232_3062_1837/master/3062.jpg?width=620&quality=85&auto=format&fit=max&s=035eb3221a09e63dc2d223767dfd8af3

కెమెరా సెట్టింగ్స్..

చంద్రుని అద్భుతమైన చిత్రాలు తీయాలంటే నిజంగానే టెలిఫోటో లేదా జూమ్ లెన్స్ అవసరం ఉంటుంది. ప్రొఫెషనల్ కెమెరా, ట్రైపాడ్స్‌తో పాటు షట్టర్‌ను విడుదల చేయడానికి కేబుల్ రిలీజ్ ఆప్షన్ లేదా ‘టూ సెకన్ డిలే టైమర్‌’ను కూడా ఉపయోగించాలి. ఎందుకంటే క్లిక్ బటన్ ప్రెస్ చేసినపుడు కెమెరా కదలకుండా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. ఇది ఫ్రేమ్‌లో మూన్ సైజును పెంచడమే కాకుండా ఇమేజ్‌ను షార్ప్ చేసే కొద్దీ అందులోని వివరాలు స్పష్టంగా కనబడేలా చేస్తుంది. మీరు యూజ్ చేస్తున్న కెమెరా క్వాలిటీని బట్టి సెట్టింగ్స్ చేసుకోవచ్చు. కానీ ఇమేజ్ క్వాలిటీని పెంచే ISOను 100గా సెట్ చేసుకోవడంతో పాటు ఫైల్ సైజును ‘రా(Raw)’గా మార్చుకోవాలి. ఇది మీ కెమెరాలోని లార్జెస్ట్ ఫైల్‌ సైజును ఎంచుకోవడంలో ఉపకరిస్తుంది. చంద్రున్ని పిక్చరైజ్ చేసేటపుడు Aperture(కెమెరాలో ఓపెనింగ్ లెన్స్) ఇంపార్టెంట్ కాదు కాబట్టి f8 సరిపోతుంది.

Advertisement

Next Story