టిక్‌టాక్ వీడియోలు.. ఇలా డౌన్‌లోడ్ చేయండి

by Anukaran |   ( Updated:2020-07-01 08:19:10.0  )
టిక్‌టాక్ వీడియోలు.. ఇలా డౌన్‌లోడ్ చేయండి
X

దిశ, వెబ్‌డెస్క్: డేటా ప్రైవసీ వల్ల.. కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్ సహా షేర్ చాట్, యూసీ బ్రౌజర్, క్యామ్ స్కానర్, వీ చాట్, క్లబ్ ఫ్యాక్టరీ ఇలా మొత్తంగా 59 యాప్‌లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. 119 మిలియన్ల యాక్టివ్ యూజర్లున్న టిక్‌టాక్‌పై బ్యాన్ విధించడంతో.. అందులో ఉన్న తమ డేటా గురించి యూజర్లు తెగ వర్రీ అవుతున్నారు. అయితే, టిక్​టాక్​ యూజర్లు తమ వీడియోలను యాప్​ నుంచి డౌన్​లోడ్​ చేసుకునేందుకు మార్గాలున్నాయి. మాన్యువల్‌గా ఒక్కొక్కటిగా డౌన్‌‌లోడ్ చేసుకోవడం.. ఒక పద్ధతి కాగా, టిక్‌టాక్ యాప్ నిర్వాహకులకు డైరెక్ట్‌గా డేటా కావాలని రిక్వెస్ట్ పెట్టడం రెండో పద్ధతి. ఇందుకోసం ఏం చేయాలంటే..

మాన్యువల్ మెథడ్ :

– టిక్​టాక్​ ప్రొఫైల్​లో ఎంటర్ కావాలి.
– డౌన్‌లోడ్ చేయాలనుకున్న వీడియోపై క్లిక్​ చేయాలి.
– త్రీ డాట్స్ ఐకాన్‌ను నొక్కి వీడియోను సేవ్​ చేయాలి.
– ఆ పర్టిక్యులర్ వీడియో.. మన డివైజ్‌లో డౌన్‌లోడ్ అవుతుంది.
– మీకు కావాల్సిన ఇతర వీడియోలకు కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌ను ఫాలో కావాలి.
అయితే ఇలా డౌన్‌లోడ్ చేసిన వీడియోపై వాటర్ మార్క్ ఉంటుంది. అయితే, ఆ టాపిక్‌ను మనం ఆల్రెడీ కవర్ చేసివుంటాం కనుక దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు.

రిక్వెస్ట్ డేటా :

ఒకేసారి మొత్తం డేటా కావాలనుకుంటే..

– టిక్​టాక్​ను ఓపెన్ చేసి.. త్రీ ఐకాన్ బటన్ ట్యాప్ చేయాలి.
– ప్రైవసీ అండ్ సేఫ్టీలోకి వెళ్లి – డేటా పర్సనలైజేషన్‌ను ఎంచుకుని డేటా డౌన్​లోడ్​పై క్లిక్ చేయాలి.
– ఆ తర్వాత, రిక్వెస్ట్​ డేటాపై క్లిక్ చేస్తే.. అది టిక్​టాక్​కు వెళ్తుంది.
– రిక్వెస్ట్ పంపిన తర్వాత.. 30 రోజుల్లోగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది.
– అందుకోసం ఎప్పటికప్పుడు టిక్‌టాక్‌ను చెక్ చేస్తూ ఉండాలి.
– కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చిన తర్వాత డౌన్‌లోడ్ డేటా ట్యాబ్‌‌పై క్లిక్ చేస్తే డేటా వచ్చేస్తుంది. మెసేజ్ వచ్చిన నాలుగు రోజుల్లోగా డేటా డౌన్​లోడ్ చేసుకోవాలి. లేకపోతే ఎక్స్​పైర్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed