ఆ జిల్లా విషయంలో ఏం చేద్దాం?

by Anukaran |   ( Updated:2020-07-15 00:03:07.0  )
ఆ జిల్లా విషయంలో ఏం చేద్దాం?
X

దిశ, ఏపీ బ్యూరో: దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒకటైన అరకును ఎలా జిల్లా చేయాలన్న చర్చ కేబినెట్ భేటీలో జరుగుతుంది. అరకు నియోజకవర్గం విస్తీర్ణంలో పెద్దది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో విస్తరించి ఉంది. దీంతో ఈ పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా చేయడం సాంకేతికంగా ఇబ్బందిగా మారనుంది. జిల్లా కేంద్రంగా చేయాలని అరకు, పార్వతీపురం ప్రాంత ప్రజలు సుదీర్ఘ కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండు ప్రాంతాలకు భౌగోళికంగా కనెక్టివిటీ లేకపోవడం కూడా.. ఈ జిల్లా ఏర్పాటుపై ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీలో ఈ ప్రాంతంపై చర్చ జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed