అంగారకుడిపై జీవవాతావారణం ఎలా మాయమైందంటే..

by Anukaran |   ( Updated:2021-02-22 06:15:48.0  )
అంగారకుడిపై జీవవాతావారణం ఎలా మాయమైందంటే..
X

దిశ, ఫీచర్స్: మార్స్(అంగారకుడు)పై జీవాన్వేషణకు ‘నాసా’ పంపిన ‘పర్సెవరెన్స్ రోవర్’ సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ అయి.. తొలి మార్స్ ఫొటోను భూమ్మీదకు పంపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పరిశోధకులు రెడ్ ప్లానెట్‌పై జీవ వాతావరణం ఎలా మాయమైందో తాజాగా కనుగొన్నారు. లండన్ రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. సోలార్ విండ్స్ (సూర్యుడి బలమైన పవనాలు) కుజుడిపైకి వెళ్లడం వల్ల అక్కడి జీవ వాతావరణం అంతర్థానమై ఉండొచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. భూమికి ఉన్నట్లు అంగారకుడికి రక్షిత అయస్కాతం క్షేత్రం ఉండకపోవచ్చని రెడ్ ప్లానెట్‌పై కంప్యూటర్ సిమ్యులేషన్ స్టడీ జరిపిన ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)’ కోల్‌కతా శాస్త్రవేత్తలు అర్నబ్ బసక్, డిబ్యెండు నాండి అభిప్రాయపడ్డారు.

రేడియేషన్స్‌తో కూడిన సూర్యుడి పవనాలు భూమ్మీద పడకుండా అడ్డుకునే రక్షిత అయస్కాంత క్షేత్రం వల్లే భూమిపై జీవుల మనుగడ కొనసాగుతున్నదని పరిశోధకుల అంచనా. ఇలాంటి అయస్కాంత క్షేత్రం లేకపోవడం వల్లే అంగారకుడిపై జీవుల మనుగడకు అవసరమయ్యే వాతావరణం అంతమైందని వారు భావిస్తున్నారు. ఈ అయస్కాంత క్షేత్రం లేకపోతే రేడియేషన్ పవనాలు అట్మాస్పియర్ కండిషన్స్‌ను కచ్చితంగా కొలాప్స్ చేస్తాయని పలువురు పరిశోధకులు తమ పరిశోధనా పత్రాల్లో వివరించారు. రెడ్ ప్లానెట్‌పై జీవ వాతావరణ అంతర్థానానికి రెండు పాజిబిలిటీస్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు తమ తాజా అధ్యయనంలో వెల్లడించారు. అంగారకుడిపై అయస్కాంత క్షేత్రం ఉండి, దాని జీవ వాతావరణాన్ని సోలార్ విండ్స్ అంతం చేయకుండా చేస్తున్నాయనుకోవడం ఒకటి కాగా, అసలు మార్స్‌పై రక్షిత అయస్కాంత క్షేత్రం లేదని తద్వారా జీవ మనుగడకు అవసరమయ్యే వాతావరణం ఉండబోదనేది మరో పాజిబిలిటీ.

Advertisement

Next Story