- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ లెక్క ఎట్ల పూడుస్తరో..!
దిశ, మహబూబ్‌నగర్: భారత్ సహా ప్రపంచాన్ని కుదిపేస్తోన్న నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో వివిధ వ్యాపారులు నష్టాల బారిన పడ్డారు. కానీ, మద్యం షాపుల యజమానులకు మాత్రం కాసుల వర్షం కురిసిందనే చెప్పాలి. ఇందులో ముఖ్యంగా లాక్ డౌన్ కంటే ముందే మద్యం అధికంగా నిల్వ పెట్టుకున్న వారికి బాగా కలిసొచ్చింది. తాజాగా ప్రభుత్వం మద్యం షాపులకు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో మద్యం షాపుల్లో ఖాళీ అయిన మద్యం లెక్కలను ఎట్ల పూడుస్తరో..? అనే చర్చ జిల్లాలో మొదలైంది. లాక్ డౌన్ కంటే ఒక్క రోజు ముందు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన స్టాక్ పాయింట్ నుంచి వ్యాపారులు ఏకంగా రూ.10కోట్ల మద్యం తీసుకెళ్లారు. వీటితో పాటు గతంలో వీరి వద్ద ఉన్న నిల్వలు ప్రస్తుతం షాపులలో ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్టాక్ నిల్వలకు సంబంధించి రిజిస్టర్లలో లెక్కలు ఎలా సరిచేస్తారు..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
లోలోపల మద్యం మాయం..!
జిల్లాలో లాక్ డౌన్‌లోనూ మద్యం అమ్మకాలు జోరుగా జరిగాయనే ఆరోపణలున్నాయి. జిల్లాలో ఇప్పటికే 6 మద్యం దుకాణాల్లో చోరీలు జరిగినట్లు ఫిర్యాదులు నమోదయ్యాయి. అయితే, ఈ చోరీలు జరిగిన సమయంలో లిక్కర్ స్టాక్‌తో పాటు స్టాక్‌కు సంబంధించిన రిజిస్టర్లూ మాయం కావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరైనా మద్యం ఎత్తుకెళ్తారు కానీ, రిజిస్టర్లను తీసుకెళ్లడం ఏంటని అనుకుంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఏకంగా రూ.10లక్షల విలువ గల మద్యం చోరీకి గురికావడం చర్చనీయంశంగా మారింది. చోరీ చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కానీ, వారి నుంచి కేవలం రూ.10వేల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. మద్యం షాపులతో పాటు బార్లనూ సీల్ చేశారు. అయితే, బయట వేసిన సీల్ అలానే ఉన్నా లోలోపల మద్యం మాయమైందని స్పష్టమవుతోంది.
ఎక్సైజ్ మంత్రి ఇలాకాలోనే..
మంగళవారం రాత్రి నుంచి అబ్కారీ శాఖ అధికారులు పలు చోట్ల మద్యం షాపులను తెరవగా చాలా వరకు షాపులో స్టాక్ లేకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. స్వయాన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జిల్లా కావడంతో ప్రతిపక్షాలూ ఈ విషయంలో కొంత దూకుడుగానే వ్యవహరిస్తున్నాయనే చెప్పాలి. అధికారులపై అధికార పార్టీ నేతల ఒత్తిడి ఉందనీ, అందుకే అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఎక్సైజ్ అధికారులు అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారి పై 81 కేసులు నమోదు చేశారు. 86మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, లాక్ డౌన్ తర్వాత జిల్లాలో అనధికారికంగా కోట్ల రూపాయల మద్యం దందా జరిగిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి మద్యాన్ని అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు ఈ మద్యం షాపుల విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.
Tags: calculations of liquor, registers lost, lock down, corona times, excise police, officers,