కరోనా.. అదెక్కడంటున్న హైదరాబాదీ

by sudharani |
కరోనా.. అదెక్కడంటున్న హైదరాబాదీ
X

దిశ, హైదరాబాద్:
చైనాలో పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్‌‌పై హైదరాబాద్‌కు చెందిన యువకుడు బొగ్గుల శ్రీనివాస్ యుద్ధం ప్రకటించాడు. కరోనాకు భయపడాల్సిన అవసరం లేదంటూ మూడ్రోజులుగా మెట్రో రైళ్లు, సిటీ బస్సుల్లో తిరుగుతూ అవగాహన కలిగిస్తున్నాడు. ముందుగా చికెన్ తింటే కరోనా వస్తోందని ప్రచారం జరగడంతో చికెన్ తినడం ప్రారంభించిన శ్రీనివాస్.. సిటీ బస్సుల్లో డే పాస్ తీసుకొని రోజంతా నగరాన్ని చుట్టేస్తున్నాడు. కరోనా వైరస్ తీవ్రత ఉన్నమాట నిజమే కానీ, ప్రజలు అంతగా భయపడాల్సింది ఏమీ లేదు. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది, అంతేగానీ మన పనులు కూడా చేసుకోనంతగా భయపడాల్సిన పనిలేదని చెప్పుకొస్తున్నాడు. కరోనా ప్రభావంతో బస్సులు, మెట్రోలో తిరిగే వారు 30శాతం తగ్గారని పేర్కొన్నాడు.

tags : Corona virus, Hyderabad, city buses, metro rails, chicken, Boggula Srinivas

Advertisement

Next Story