- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంత కష్టం వచ్చింది.. కాడెద్దులుగా మారిన గ్రాడ్యుయేట్లు…!
దిశ, మంగపేట : మండలంలోని దోమెడ గ్రామానికి చెందిన జాడి నరేందర్, శ్రీనివాస్ లు హైదరాబాద్ పట్టణంలోని మాదాపూర్ శ్రీ చైతన్య (సరస్వతి బాయ్స్ క్యాంపస్)లో కంప్యూటర్ ఆపరేటర్ గా ఒకరు, టీచర్ గా ఒకరు ఉద్యోగాలు చేసుకుంటున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ అన్నదమ్ములు, కరోనా మహమ్మారి వలన ఉద్యోగాలు వదిలి స్వంత ఊరు చేరి కూలిపనులు చేసుకుంటున్నారు. వారికున్న ఎకరంన్నర పొలంలో సాగు చేసుకుంటూనే గ్రామంలో ఉపాధి హామీ పథకంలో కూలీ పనులు చేసుకుంటూ తమ కుటుంబాలు పోషించుకుంటున్నారు. బీఎస్సీ, బీఈడీ చదువుకున్నప్పటికీ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుని బ్రతుకుతున్నా కరోనాతో వాటిని సైతం వదిలి పెట్టాల్సి వచ్చిందని వాపోతున్నారు.. స్వంతగా ఎద్దులు లేక ట్రాక్టర్ తో పొలం దున్నించుకునే స్థోమత లేక వారే కాడెడ్లుగా మారి తమ పొలాన్ని సాగు చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరుతున్నారు.