ట్రెండింగ్‌లో.. ఇయర్ ఆఫ్ ది ఆక్స్

by Sujitha Rachapalli |
ట్రెండింగ్‌లో.. ఇయర్ ఆఫ్ ది ఆక్స్
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటారు. అలాగే చాంద్రమానాన్ని అనుసరించే తెలుగు, కన్నడ, మహారాష్ట్ర ప్రజలు చైత్ర శుద్ధ పాడ్యమి రోజున నూతన సంవత్సరాదిని జరుపుకుంటే.. సౌరమానాన్ని పాటించే తమిళ, సిక్కు, మలయాళీ, బెంగాలీలు వసంత కాలంలోనే కొత్త సంవత్సరాదిని జరుపుకోవడం విశేషం. అలా కొన్ని దేశాల్లో వారి ఆచార, సంప్రదాయాలను బట్టి కొత్త సంవత్సర వేడుకలు చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే చైనీయులు జరుపుకునే న్యూ ఇయర్ లేదా లూనార్ న్యూ ఇయర్‌‌‌ను ‘స్ప్రింగ్ ఫెస్టివల్’ అని పిలుస్తారు. లూనార్ క్యాలెండర్‌ను అనుసరించి వారు ఈ వేడుకను సెలబ్రేట్ చేసుకుంటుండగా.. ఈ కొత్త ఏడాది ఫిబ్రవరి 12న మొదలై, 27తో ముగుస్తుంది. కాగా చైనీయులు ఈ ఏడాదిని ‘వృషభనామ’ సంవత్సరంగా జరుపుకుంటుండటంతో సోషల్ మీడియాలో ‘ఇయర్ ఆఫ్ ది ఆక్స్’ గ్లోబల్ ఇన్‌స్టాగ్రామ్ ట్రెండ్‌గా నిలిచింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

చైనీయుల రాశి చక్రం ప్రకారం.. ఒక్కో సంవత్సరానికి ఒక్కో జంతువు పేరు పెడతారు. అలా పన్నెండు జంతువులు ఈ రాశిచక్రం గుర్తులను సూచిస్తున్నాయి. గతేడాది(‘ఎలుకనామ’ సంవత్సరం) కరోనాతో ఆర్థిక, ప్రాణ నష్టాలను చవిచూసిన చైనాకు ఈ ‘వృషభ నామ సంవత్సరం(ఇయర్ ఆఫ్ ది ఆక్స్) సూపర్‌గా ఉండబోతుందని ఆస్ట్రాలజిస్టులు చెబుతున్నారు. కాగా ‘ఆక్స్ ఆఫ్ ది ఇయర్’ తమకు స్థిరత్వం, ప్రశాంతతను తీసుకొస్తుందని చైనీయులు ఆశాజనకంగా ఉన్నారు. ఇది గొప్ప అవకాశాలతో పాటు ఆర్థిక శ్రేయస్సును అందించే సంవత్సరంగా ఆస్ట్రాలజిస్టులు అంచనా వేశారు.

ఇంతకీ ‘ఆక్స్ ఆఫ్ ది ఇయర్’ సోషల్ మీడియా ట్రెండ్‌గా ఎలా నిలిచిందంటే.. చైనా నూతన సంవత్సర సెలెబ్రేషన్స్‌లో భాగంగా.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ స్పెషల్ స్టిక్కర్క్‌తో పాటు ఏఆర్ ఎఫెక్ట్స్, ప్రత్యేక ఫిల్టర్స్‌‌ను అందిస్తున్నాయి. ఈ మేరకు ఇన్‌స్టా ‘స్టోరీ ఫీచర్’తో ప్రపంచంలోని చైనీయులను ఆన్‌లైన్ వేదికగా ఒక్కటి చేయాలనుకుంటోంది. ఈ క్రమంలోనే చైనీయులు తమ వేడుకలను ‘ఇన్‌స్టా స్టోరీ’లుగా పంచుకోవాలంటే.. ‘ఇయర్ ఆఫ్ ది ఆక్స్’ స్టిక్కర్లను ఉపయోగించాలనే నిబంధన చేర్చింది. పైగా కొవిడ్ -19 నిబంధనలు కూడా ఉండటంతో ఈ స్టిక్కర్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచాయి. కాగా ఇవి ఫిబ్రవరి 17 వరకు ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉండనున్నాయి. అయితే చైనాలో ఫేస్‌బుక్ అందుబాటులో లేని విషయం తెలిసిందే.

ఇక చైనాతో పాటు వియత్నాం, కొరియా, టిబెట్‌లు కూడా లూనార్ న్యూ ఇయర్‌ను జరుపుకుంటుండగా, ఆయా దేశాల్లో వృషభాలకు సంబంధించిన బొమ్మలు, బహుమతులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Advertisement

Next Story